WGL: అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితమైన వారు కాదని, ఆయన అన్ని వర్గాల ప్రజలకు చెందిన మహనీయుడని వరంగల్ MP కడియం కావ్య అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బాబాసాహెబ్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.