SDPT: హుస్నాబాద్ నుంచి కొండాపూర్ బైపాస్ రోడ్డు ప్రమాదాలకు సూచికగా మారింది. ఇటీవల రోడ్డు నిర్మాణం చేపట్టినప్పటికీ ఇటీవల వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా కృంగిపోయి వాహనాలకు ప్రమాదకరంగా మారాయి. అధికారులు ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలని వాహనదారులు కోరుతున్నారు.