TG: నిన్న ఏపీ రాజంపేటలో భార్య ఉరేసుకుంటే.. భర్త వీడియో తీసిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. ‘కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ పంతాలకు పోయి, ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయే దాకా కెమెరా పట్టుకుని చోద్యం చూడటం పైశాచికత్వం. దయచేసి బంధాలకు విలువ ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు.