SR : మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సురేఖ పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైంది. ఇస్నాపూర్లో ఆటో నడుపుతున్న బంధువు వికాస్ ఇంటికి వచ్చిన ఆమె, ఈ నెల 11న పెళ్లి చూపుల కోసం డ్రెస్ కొనడానికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్థానికంగా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వికాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.