CTR: పూతలపట్టు మండలంలో ఇవాళ ఉదయాన్నే ప్రమాదం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం బెంగళూరు నుంచి నలుగురు కారులో బయలుదేరారు. పీజీ మిట్టూరు సమీపంలోని బాట గంగమ్మ దేవస్థానం వద్దకు రాగానే కారు అదుపుతప్పింది. డివైడర్ పక్కన కాలువలో బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.