AKP: ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్ వద్ద 10.8 కిలోల గంజాయితో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ రామకృష్ణ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా అడ్డరోడ్డు జంక్షన్లో ఎస్సై విభీషణరావు సిబ్బందితో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి లభించిందన్నారు. అనంతరం నిందుతులను రిమాండ్‌కు తరలించామన్నారు.