ADB: గ్రామాభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శిల సంఘం నాయకులు కలెక్టర్‌తో కలిసి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పంచాయతీ కార్యదర్శుల సమస్యలను కలెక్టర్‌కు వివరించగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.