W.G: విద్యుత్ మెయింటనెన్స్ పనుల్లో భాగంగా శనివారం అత్తిలి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ డివిజనల్ ఇంజనీర్ నర్సింహమూర్తి వెల్లడించారు. అత్తిలి-తణుకు రోడ్డు, కొమ్మర, ఉరదళ్ళపాలెం, వరిగేడు, మంచిలి, ఈడూరు, స్కిన్నెరపురం తదితర గ్రామాల్లో ఉ.8 గంటల నుంచి మ.1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.