VZM: ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా మృతి చెందిన ఘటన కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి చింతలపాలెం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. శిరిడీ రమణమ్మ కిరాణా దుకాణానికి వస్తుండంగా రోడ్డు దాటే క్రమంలో పెందుర్తి నుంచి కొత్తవలస వస్తున్న ద్విచక్ర వాహన దారుడు బలంగా డీ కొట్టాడు. ఆమె స్టాపర్పై పడడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.