KNR: జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, సరఫరా యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో సమీక్షించిన ఆమె, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యవేక్షణ కోసం 12 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9154249727ను సంప్రదించాలని అన్నారు.