MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు టెన్త్ పరీక్ష జరుగుతుందని ఆయా మండలాల ఎంఈఓలు తెలిపారు. లక్షెట్టిపేటలో 773 , దండేపల్లిలో 354 మంది, జన్నారంలో 661 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.