ASF: కాగజ్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.