ఒక్కోసారి ఓ నెలలో కరెంట్ బిల్లు అమాంతంగా పెరిగి వస్తుంది. అయితే ఒక నెలలో కరెంటు వినియోగం గతంలో కంటే ఒక్కసారిగా పెరిగినా.. లేదా తగ్గినా దానిపై నెల రోజుల్లోగా విచారణ జరిపాలని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. విచారణ పూర్తయ్యేవరకు గతంలో వచ్చిన బిల్లునే వినియోగదారుడు చెల్లించవచ్చు. అప్పటివరకు సదరు కనెక్షన్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి వీల్లేదని అధికారులను ఆదేశించింది.