WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తిని పాము కాటు వేసిన ఘటన కలకలం రేపుతుంది. మార్కెట్ క్యాంటీన్లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి వంట చెరుకు తీస్తుండగా అందులో దాక్కున్న పాము అతడిని కాటేసింది . గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.