TG: మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్ వేళ MJA ప్రతినిధిని గృహనిర్బంధం చేయడంపై మూసీ జన ఆందోళన సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య రీతిలో చర్చలకు, ప్రత్యామ్నాయ సూచనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చి ఆ మరుసటి రోజే తమ కార్యకర్తను నిర్బంధించడాన్ని ప్రశ్నించింది. కాగా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చడాన్ని ఈ సంస్థ తప్పుబడుతోంది.