GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చిన పలు అంశాలపై స్పందించి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను గురువారం ప్రజాప్రతినిధులు అధికారులు పరిశీలించారు. మండల వ్యవసాయ అధికారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి పంటల నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఈ అకాల వర్షం వల్ల తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందన్నారు.
KMM: నేలకొండపల్లి, ముదిగొండ మండలంలో ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు తప్పడం లేదని రైతులు వాపోయారు. గురువారం పలువురు రైతులు మాట్లాడుతూ.. మిల్లర్లు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా మిల్లుకు తీసుకురావాలని చెప్తున్నట్లు పేర్కొన్నారు. మిల్లుకు ధాన్యం తరలిస్తే రూ.1800లకు కొనుగోలు చేస్తామని, ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ అందిస్తామని చెప్తున్నట్లు తెలిపారు.
VZM: రైల్వే లోకో పైలెట్లపై పని భారం తగ్గించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పి.శంకరరావు డిమాండ్ చేశారు. బొబ్బిలి సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. లోకో పైలెట్లకు విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా పని చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, తక్షణమే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
MNCL: జన్నారం మండలంలోని దేవునిగూడ గ్రామంలో మండల అధికారులు సన్న బియ్యం భోజనం చేశారు.. ఆ గ్రామానికి చెందిన లబ్ధిదారులు మడావి బాదిరావు, లింగారెడ్డితో కలిసి గురువారం మధ్యాహ్నం తహసీల్దార్ రాజా మనోహర్ రెడ్డి, ఎంపిడిఓ షరీఫ్, డిప్యూటి తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ భానుచందర్ సన్న బియ్యం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్, కార్యదర్శి సరితా ఉన్నారు.
కృష్ణా: బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మాణము, ఆధునికీకరణ చేయు పనులకు శంఖుస్థాపన కార్యక్రమంలో గురువారం పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే డిగ్రీ కళాశాలకు 5 కోట్ల నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.
NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పీఏపల్లి మండలం అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, పీఏపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవం, కొండమల్లేపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, దేవరకొండలో పోషణ్ అభియాన్ కార్యక్రమం, మైనంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేస్తారు.
AKP: పోషణ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం గొలుగొండ ఐసీడీఎస్ పరిధిలో ఉన్న గొలుగొండ, నాతవరం మండల అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీడీపీవో శ్రీగౌరి పోషణ పక్షోత్సవాల్లో ముఖ్యమైన అంశాలను అంగన్వాడీలకు వివరించారు. అలాగే ప్రతి ఒక్క బాలింతకు, గర్భిణీలకు అవగాహన కల్పించాలన్నారు.
KDP: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించవద్దని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రవిశంకర్ రెడ్డి అన్నారు. గురువారం మరియాపురం వద్ద ఉన్న ఆ బ్యాంకు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రాయలసీమలో ఉన్న అనేక సంస్థలను ఇతర ప్రాంతాలకు తరలించి కరువు ప్రాంతంగా మార్చారన్నారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి 33వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా 18న అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటలకు లక్ష కుంకుమార్చన, 19న నవగ్రహ చండీ హోమం, అన్నసంతర్పణ, 20న బోనాలు ఉంటాయన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈనెల 12న ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ‘రామ రామ’ అంటూ సాగే పాటను విడుదల చేస్తామని తెలిపింది. బింబిసార ఫేం వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు.
చైనా దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలను ప్రకటించడంపై చైనా స్పందించింది. తాము చైనీయులమని.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొంది. ఈ సందర్భంగా 1953 అమెరికా-చైనాల మధ్య యుద్ధం నేపథ్యంలో అప్పటి డ్రాగన్ నాయకుడు మావో జెడాంగ్ ప్రసంగించిన వీడియోను మళ్లీ తాజాగా పోస్టు చేసింది. కాగా, ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది.
AP: తిరుపతి జిల్లా చంద్రగిరిలో మైనర్ అనుమానాస్పద మృతిపై ఆమె ప్రియుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మూడేళ్లు ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నాం. తన పేరెంట్స్ నాపై పోక్స్ కేసు పెట్టి జైలుకి పంపారు. గర్భం దాల్చిందని అబార్షన్ చేయించారు. విషం పెట్టి అమ్మ, మామ, తాత చూస్తున్నారని నాకు మెసేజ్ చేసింది. తర్వాతి రోజే చనిపోయింది.’ అంటూ చాటింగ్‌ను పంచుకున్నాడు.
మాఫియా కథ నేపథ్యంలో తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫర్వాలేదనిపిస్తుంది. అజిత్ నటన, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. పాత కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తడబాటుకు గురయ్యాడు. అజిత్ ఎలివేషన్ సీన్‌లు అలరిస్తాయి. త్రిష, సిమ్రాన్ పాత్రలు ఆకట్టుకోవు. రేటింగ్: 2.5/5.
TPT: తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసపురం, ఓటేరు, పద్మావతిపురం, వేదాంతపురం పంచాయతీలలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేదాంతపురంలో మరో రెండు నీటి బోర్లు వేసి నీటి సమస్యను అధిగమించాలన్నారు.