బాలీవుడ్ దివంగత నటుడు రిషి కపూర్ వ్యక్తిత్వ హక్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆయన పేరు, ఫోటోలు, గొంతును వాణిజ్య ప్రయోజనాల కోసం వాడాలంటే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. రిషి కపూర్ గౌరవానికి భంగం కలగకుండా, ఆయన ఇమేజ్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నీతూ కపూర్, రణ్బీర్ కపూర్ పేర్కొన్నారు.