NGKL: కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.