W.G: ఉండి నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీ వర్గాల సంక్షేమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఎంతో కృషి చేస్తున్నారని ఆకివీడులోని TDP ముస్లిం పెద్దలు స్పష్టం చేశారు. స్థానిక TDP కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కొంతమంది కావాలని డిప్యూటీ స్పీకర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పంట కాలవలపై ఉన్న అక్రమణలు మాత్రమే తొలగించారని, మసీదులు అభివృద్ధికి ఆయన సాయపడ్డారని తెలిపారు.