BPT: కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామంలో ఇంటి పన్ను వసూళ్లు కార్యక్రమాన్ని శుక్రవారం ఎండీవో రాజ్యలక్ష్మి పరిశీలించారు. ఇంటి పన్ను వసూలు అవుతున్న తీరును ఆమె పంచాయతీ సెక్రెటరీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎండీవో మాట్లాడుతూ.. ప్రజలు నిర్దేశించిన గడువులో ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అన్నారు.