SRD: హత్నూరలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలకు 10 కంప్యూటర్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జేఈఈ, నీట్ కోచింగ్ కోసం ఈ కంప్యూటర్లను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్, వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఫిజికల్ డైరెక్టర్ గణపతి పాల్గొన్నారు.
KMM: వేసవి తీవ్రత నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. రైతులు, కూలీల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వెంటనే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ELR: ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా మహిళలు స్వశక్తి పై జీవించాలని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. గురువారం ఉంగుటూరు పాత సచివాలయం వద్ద ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
SRD: రాష్ట్రీయ సప్తహ్ ఆవిష్కార కార్యక్రమానికి ఎంపికైన 78 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగ పత్రాలు సమర్పించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులను నేరుగా ఆయా పాఠశాల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు.
SRD: జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చిన వారికి చలివేంద్రం ద్వారా చల్లని నీరు అందించడం అభినందనీయం అని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.
KNR: ట్రాక్టర్‌తో పాటు ఓ చిన్నారి బావిలో పడి మృతి చెందిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ రూరల్‌లో బహదూర్ ఖాన్ పేటలో చోటుచేసుకుంది. బొమ్మరెడ్డిపల్లెకు చెందిన జశ్విత బంధువుల ఇంటికి బహుదూర్ ఖాన్ పేటకు వచ్చింది. వ్యవసాయ బావి వద్ద ట్రాక్టర్ సీటులో కూర్చుని తాళం తిప్పడంతో ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందింది.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు గోదావరిఖని RCOA క్లబ్ ఆవరణలో క్వార్టర్స్ కౌన్సెలింగ్ నిర్వహించారు. అధికారులు గోపాల్ సింగ్ పాల్గొని ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించారు. ఈ కౌన్సెలింగ్ పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. నాయకులు ఆరెల్లి పోషం, అధికారులు శ్రావణ్ కుమార్, హనుమంత రావు పాల్గొన్నారు.
IPLలో GT బ్యాటర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డును సాధించాడు. IPLలో మొదటి 30 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. అతడు 30 ఇన్నింగ్స్‌ల్లో 1307 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా చూస్తే రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో షాన్ మార్ష్-1338 పరుగులతో కొనసాగుతున్నాడు. తర్వాత స్థానాల్లో గేల్(1141), విలియమ్సన్(1096), హేడెన్(1082) ఉన్నారు.
వరంగల్: ఎంపీ కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘డా. కడియం కావ్య మీకు హృదయపూర్వక పుట్టినరోజుకు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మీ జీవితం ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’ అని శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాసారు.
WGL: చెన్నారావుపేట మండలం ఝల్లి పరిధి బోడతండాకు చెందిన మోహన్ అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. మోహన్ CMRF కోసం దరఖాస్తు చేసుకోగా.. రూ.40 వేల చెక్కు మంజూరైంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి గురువారం ఉదయం బాధితుడి ఇంటికి వెళ్లి ఈ చెక్కును అందించారు.
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా సెంట్రల్ డిజిటల్ లైబ్రరీని గురువారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ఆ లైబ్రరీలో అందుబాటులో ఉన్న సాంకేతికతలు, సేవలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ లైబ్రరీలను అభివృద్ధి చేయడానికి ఈ అనుభవాలు ఉపయోగపడతాయని అన్నారు.
TG: రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ని సీఎం రేవంత్ ప్రారంభించారు. విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తరగతి గదులను, క్లాస్ రూముల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 15వ వార్డు గణేష్ నగర్ ,బైరెడ్డి వారి వీధిలో గురువారం శానిటేషన్ సెక్రెటరీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులు ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సెక్రటరీ మాట్లాడుతూ.. కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ ఆదేశాల మేరకు శానిటేషన్ పనులు చేపట్టారు. ఈ పనులను వార్డ్ టీడీపీ నాయకులు పి. రమణ పర్యవేక్షించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన ఓ చిన్నారి చిన్నతనంలోనే రెండు కిడ్నీలు పోవడం బాధాకరమని నందన్ కృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు గోపాల్ ఉర్లాన తెలిపారు. ఆయన గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తోటి విద్యార్థులు ఆ పిల్లవాడిని ఆదుకున్న తీరు ప్రశంసనీయమని అన్నారు.
జనగామ: ప్రభుత్వ నిషేధిత అంబర్, గుట్కాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీదేవి తెలిపారు. తరిగొప్పులలోని ఓ కిరాణ దుకాణంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.13వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని దుకాణ నిర్వాహకుడు నర్సింహులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు