HYD: హెచ్‌సీయూలోని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏబీవీపీ హెచ్‌సీయూ శాఖ ఇద్దరు పరిశోధక విద్యార్థులను అధ్యక్ష, కార్యదర్శులుగా నియమించారు. ఆదివారం ఏబీవీపీ జాతీయ సెంట్రల్ యూనివర్సిటీల విభాగం కన్వీనర్ బాలకృష్ణ వివరాలను తెలిపారు. అధ్యక్షుడుగా అనిల్ కుమార్, కార్యదర్శిగా ఆయుష్ మార్సింగ్‌లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
HYD: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా అభ్యర్థులు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
PLD: పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. భోగి పండగ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు వివరించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.
VZM: జంరూవతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసే వరకు పోరాటం తప్పదని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరిశర్ల కృష్ణమూర్తి ఆదివారం హెచ్చరించారు. ఈ మేరకు పార్వతీపురం మార్కెట్ యార్హులో వివేకానంద విగ్రహం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభించారు. చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు పరిరక్షణ భావితరాలకు భవిష్యత్తని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
GNTR: నగరంలో జరుగుతున్న నరెడ్కో ప్రాపర్టీ షోని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, వినుకొండ శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు ఆదివారం సందర్శించారు. స్థిరాస్తి రంగ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని పరిశీలించారు. వారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమైన స్టాల్స్ యజమానులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
NLG: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా శాఖ అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఆదివారం TGO జిల్లా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర రోడ్‌లో భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో TGO జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
PLD: మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు తెలిపారు. మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు.
VZM: ప్రజలందరూ భోగ భాగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలన్నదే కూటమి ప్రభుత్వం ఆశయమని అన్నారు. గ్రామాల్లో పాడి సంపద అభివృద్ధి చెంది, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్ని రంగాలు ప్రగతి బాటలో పయనించాలని కోరారు. ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలని ఆదివారం తెలిపారు.
TG: నాగర్‌కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా 1996లో తొలిసారి టీడీపీ నుంచి నాగర్‌కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004, 2009లో గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్‌లో చేరిన ఆయన 2023లో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.
VZM: ఇటీవల తిరుపతి తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన మాటప్రకారం ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చెక్కులు పంపిణీ చేశారు. గాయపడిన కొత్తవలస మండలం GSN రాజు నగర్‌కి చెందిన బి. శ్రీనివాసరావుకు విశాఖపట్నం విమానాశ్రయంలో రూ. 2,00,000 లక్షలు ప్రభుత్వం నుండి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
KMM: మధిర పట్టణంలోని సుందరయ్య నగర్ నందు ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు తెలుగు సినీ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీవీ ఛానల్ ఆర్టిస్టులు హాజరయ్యారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వామివారికి శ్రీరామ అలంకరణ చేసి, శ్రీదేవి, భూదేవి సమేతంగా సింహగిరి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దఎత్తున పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.
VZM: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సొంతంగా సమకూర్చుకున్న 4 ఎక్స్‌ప్రెస్ బస్సులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం -పార్వతీపురం రూట్‌లో రెండు, విజయనగరం- శ్రీకాకుళం రూట్‌లో రెండు బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ ఆరు నెలల్లో 14 బస్సులను ప్రారంభించామని మంత్రి తెలిపారు.
కోనసీమ: మండపేట నియోజకవర్గ ప్రజలకు, కూటమి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు భోగీ, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. ప్రజల జీవితాల్లో సంక్రాంతి సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలన్నారు. సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.
E.G: మూడేళ్ళ బాలుడు తప్పిపోయి రాజమండ్రిలోని మోరంపూడి గ్రామ స్విమ్మింగ్ ఫూల్ వద్ద తిరుగుతున్నాడు. తప్పిపోయిన బాలుడిని బొమ్మూరు పోలీసు స్టేషన్‌కి స్థానికుల సమాచారం మేరకు కానిస్టేబుల్ తీసుకువచ్చారు. ప్రస్తుతం బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. హిందీ మాట్లాడుతున్నాడు, తెలుగు రాదు. కావున బాలుడి వివరాలు తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.