ADB: సాత్నాల మండలంలోని సుందరగిరి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఉప సర్పంచ్ గౌతంరెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. పాఠశాలలో బలోపేతానికి గ్రామస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.