• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మహిళలు తక్కువ కాదని నిరూపించారు’

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతిని కుమ్మరి సంఘం అధ్యక్షుడు నీలకంఠం నరేష్, కార్యదర్శి ఊట్కూరి రమేష్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. 15వ శతాబ్దంలో మహిళా విద్యపై ఆంక్షలున్నా, రామాయణాన్ని సరళమైన తెలుగులో రచించారని, బడుగు వర్గాల నుండి వచ్చిన మొల్ల.. మహిళలు సాహిత్యంలో తక్కువ కాదని నిరూపించారని సర్పంచ్ వెంకటేశం అన్నారు.

March 13, 2026 / 02:05 PM IST

బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం

KMR: పట్టణంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇటీవల ముగ్గురు అమ్మాయిలు అదృశ్యమై కన్నతండ్రే చెరువులో తోసి హతమార్చిన ఘటన మరువక ముందే బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ సమీపంలో ఉన్న బాలసదనంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

March 13, 2026 / 02:04 PM IST

‘సమస్యల పరిష్కారమే లక్ష్యం’: మేయర్

PDPL: రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఇవాళ కార్పొరేషన్ పరిధిలోని 3, 48, 49 డివిజన్లలో పర్యటించారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్రక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:04 PM IST

హైవేపై ఉన్న దాబాల అనుమతులు తనిఖీ చేయాలి: కలెక్టర్

KMR: జాతీయ రహదారిపై ఉన్న దాబాలను తనిఖీ చేసి అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు.

March 13, 2026 / 02:03 PM IST

‘రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం’

NGKL: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. అదనపు కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయనను రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆకుతోట సాయిబాబు, వైస్ ఛైర్మన్ రాధాకృష్ణ, రమేష్ రెడ్డి, కృష్ణారావు తదితరులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు.

March 13, 2026 / 02:02 PM IST

హౌరా వరకు కొత్త రైలును మంజూరు చేయాలని వినతి

ASF: సిర్పూర్ MLA హరీశ్ బాబు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. చర్లపల్లి-కాగజ్ నగర్ -నాగపూర్ మీదుగా హౌరా వరకు కొత్త రైలును మంజూరు చేయాలని కోరారు. కాగజ్ నగర్, చంద్రాపూర్ ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. రైల్వే బోర్డు ఛైర్మన్ సతీశ్ కుమార్‌కు ప్రతిపాదనలు అందజేశారు.

March 13, 2026 / 02:02 PM IST

ఆసుపత్రి సూపర్డెంట్‌కు వినతిపత్రం

SRCL: ఈనెల 17న హాస్పిటల్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ శానిటేషన్ సిబ్బంది చలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సెక్యూరిటీ గార్డ్స్, సానిటేషన్ సిబ్బందితో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కార్మికులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు.

March 13, 2026 / 02:02 PM IST

అడిషనల్ డీజీపీని కలిసిన కలెక్టర్

NRML: జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ (బెటాలియన్) సంజయ్ కుమార్ జైన్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని అటవీ శాఖ వసతి గృహంలో జరిగిన ఈ భేటీలో ఆయనకు పూల మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, తదితరులు పాల్గొన్నారు.

March 13, 2026 / 02:01 PM IST

వినుకొండలో గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో తహసీల్దార్ సమావేశం

PLD: వినుకొండ పట్టణంలో ఆరు గ్యాస్ ఏజెన్సీల డీలర్లతో శుక్రవారం తహసీల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గృహ వినియోగ గ్యాస్ సరఫరాకు సంబంధించిన ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రత్యేకంగా హాస్టల్స్, హాస్పిటల్స్ ,ICDS కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ సరఫరా నిలిచకుండా చూడాలని కోరారు.

March 13, 2026 / 02:00 PM IST

గుంటూరు GGHలో సర్వర్ డౌన్.. ప్రజలకు ఇక్కట్లు

గుంటూరు GGHలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సర్వర్ పని చేయడం లేదని, అందుకే పత్రాలు అందించలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు.

March 13, 2026 / 02:00 PM IST

మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం

AKP: భూ వివాదాలపై కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదుల మేరకు చినబొడ్డేపల్లి గ్రామానికి చెందిన భూ సమస్యపై చర్చించారు. ఇరువర్గాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తిరుమల బాబు, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

March 13, 2026 / 01:54 PM IST

ఏప్రిల్ 1న ‘ఆర్టెమిస్ II మిషన్’ లాంచ్

నాసా తన ప్రతిష్టాత్మక ‘ఆర్టెమిస్ II మిషన్’ను ఏప్రిల్ 1న ప్రయోగించనుంది. ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు ఓరియన్ క్యాప్సూల్‌లో చంద్రుని చుట్టూ 10 రోజులు ప్రదక్షిణ చేసి తిరిగి భూమికి చేరుకుంటారు. ఒకవేళ 1న లాంచ్ సాధ్యం కాకుంటే, ప్రత్యామ్నాయంగా 2-6 తేదీల్లో 4 ప్రత్యామ్నాయ ముహుర్తాలను నాసా సిద్ధం చేసింది. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త అధ్యాయంగా నిలవనుంది.

March 13, 2026 / 01:50 PM IST

ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించిన సర్పంచ్.

WGL: నల్లబెల్లి(M) కేంద్రానికి సమీపంలోని రంగాపురం గ్రామంలో పరిశుభ్రత పెంపొందించే లక్ష్యంగా శుక్రవారం ‘ఫ్రైడే డ్రై డే’ కార్యక్రమాన్ని సర్పంచ్ ఓరుగంటు మాధురి రాజు నిర్వహించారు. గ్రామంలోని నీరు నిల్వ ఉండే ప్రదేశాలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను పరిశీలించి సిబ్బందితో శుభ్రపరిచారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.

March 13, 2026 / 01:45 PM IST

‘ఉస్తాద్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై నిర్మాత UPDATE

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 19న విడుదల కానుంది. తాజాగా విడుదలైన ‘కాలరే ఎత్తారా’ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ పాట లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. మార్చి 15న హైదరాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు.

March 13, 2026 / 01:44 PM IST

‘ధురందర్‌ 2’ టికెట్‌ రేటు రూ. 3100..!

భారీ అంచనాల నడుమ వస్తున్న ‘ధురంధర్-2’ టికెట్ ధరల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లో ఒక ప్రత్యేక స్క్రీన్ కోసం టికెట్ ధరను రూ.3,100గా నిర్ణయించారు. బుక్ మై షో ఛార్జీలతో కలిపి ఇది రూ.3,145కి చేరుతుంది. కేవలం 42 సీట్లు ఉన్న ఈ స్క్రీన్‌లో ప్రీమియర్స్ కోసం ఈ ధర ఫిక్స్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో రేట్లు రూ.800 వరకు ఉన్నాయి.

March 13, 2026 / 01:42 PM IST