NGKL: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. అదనపు కలెక్టర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయనను రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆకుతోట సాయిబాబు, వైస్ ఛైర్మన్ రాధాకృష్ణ, రమేష్ రెడ్డి, కృష్ణారావు తదితరులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు.