• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్షేత్రస్థాయిలో BJPని బలోపేతం చేయాలి: ఎర్రబెల్లి

WGL: భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని BJP రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. ఖిలావరంగల్ మండలంలో శుక్రవారం BJP శ్రేణులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రదీప్ రావు పాల్గొని కార్యకర్తలకు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

March 13, 2026 / 01:30 PM IST

జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సంతకాల సేకరణ

MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో జన్నారంలో సంతకాల సేకరణ ప్రారంభమైంది. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో సమితి నాయకులు ప్రజలను, ప్రముఖులను కలుస్తూ సంతకాలను సేకరించారు. వారు మాట్లాడుతూ.. హిందువులందరూ ఐక్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి నాయకులు కొండా నరేష్, ఎర్రం నరేష్, గోలి చందు, దండవేణి శ్రీధర్ ఉన్నారు.

March 13, 2026 / 01:30 PM IST

‘తొలి తెలుగు మహిళ కవయిత్రి మొల్లమాంబ’

BDK: మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుక శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కుమ్మర మొల్లమాంబ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రామాయణాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా రచించిన ధన్యజీవి మొల్ల అని కొనియాడారు.

March 13, 2026 / 01:29 PM IST

‘మూసీ కోసం 10 వేల ఇళ్లను కూల్చడం ఎందుకు’

TG: మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా వేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు లేదని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ‘కమీషన్ల కోసమే భారీ అంచనా వ్యయంతో మూసీ ప్రాజెక్టు అంటున్నారు. మూసీ ప్రాజెక్టు కోసం 10 వేల ఇళ్లు కూల్చుతామని ఆర్డర్ ఇచ్చారు. మూసీ DPR రాకున్నా పేదల ఇళ్లు ఎందుకు కూలగొడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేస్తారా?, సుందరీకరణ చేస్తారా? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

March 13, 2026 / 01:29 PM IST

‘లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి’

SDPT: 28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని కోరారు.

March 13, 2026 / 01:29 PM IST

2047 నాటికి భారత సైన్యంలో భారీ మార్పులు

భారత సైన్యాన్ని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేసేందుకు కేంద్రం విజన్-2047 రోడ్ మ్యాప్ విడుదల చేసింది. దీని ప్రకారం స్పేస్, సైబర్ కమాండ్‌లతో పాటు నాలుగు కొత్త త్రివిధ దళ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక యుద్ధ తంత్రం, వాయు రక్షణ వ్యవస్థల బలోపేతంపై రక్షణ శాఖ దృష్టి పెట్టింది. దీంతో రాబోయే రోజుల్లో మన సైన్యం మరింత శక్తివంతంగా మారనుంది.

March 13, 2026 / 01:28 PM IST

ఘనంగా మొల్ల జయంతి

WNP: గురువు వద్ద విద్యనభ్యసించకపోయినా, భగవత్ కృపతో తెలుగు సాహిత్యంలో తొలి మహా రచయిత్రిగా ఎదిగిన మొల్ల స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరం అని ప్రజావాగ్గేయకారుడు రాజారాంప్రకాష్ పేర్కొన్నారు. ఇవాళ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో మహానీయుల స్ఫూర్తి వేదిక ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల 586వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

March 13, 2026 / 01:28 PM IST

త్రాగు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు

NRML: కడెం మండలం బెల్లాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా మంజూరైన నిధులతో మంచి నీటి బోరు వెల్ ఏర్పాటు పనులకు శుక్రవారం సర్పంచ్ బొంతల లక్ష్మీ, భూమన్న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు త్రాగు నీటి సమస్యలు తలెత్తకుండా బోరు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనూష ఉన్నారు.

March 13, 2026 / 01:28 PM IST

రిపోర్టర్ పాషా కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ

JN: పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన రిపోర్టర్ ఎండి పాషా తండ్రి ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి మృతుడి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం భాషా కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

March 13, 2026 / 01:27 PM IST

అంగన్వాడీ టీచర్లకు ఎమ్మెల్యే హామీ: ఎమ్మెల్యే

NZB: అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని NZB రూరల్ MLA డా.ఆర్. భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా MLA మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

March 13, 2026 / 01:25 PM IST

పేదలకు ఇచ్చేందుకు డబ్బులు లేవా?: హరీష్ రావు

TG: కేవలం పేదల ఇళ్లు కూల్చటం గురించి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోందని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ‘డబ్బులు లేవంటున్న సర్కార్ రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అంటోంది. రైతులకు పెట్టుబడి సాయానికి, ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు డబ్బులు లేవంటున్నారు. ఈ ప్రభుత్వం ప్రాధాన్యతలో రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు లేరు’ అని మండిపడ్డారు.

March 13, 2026 / 01:23 PM IST

యథేచ్ఛగా అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు

WGL: జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో చట్టానికి విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పుట్టకముందే ఆడబిడ్డలను గర్భంలోనే హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో .5 వేల నుంచి ₹.10 వేల వరకు తీసుకొని నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు అన్నారు.

March 13, 2026 / 01:22 PM IST

15 డొమెస్టిక్ సిలిండర్‌లు సీజ్

NZB: బోధన్ పట్టణంలోని దీపక్ స్వీట్ హోమ్‌పై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు.హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లు వాడుతుండటంతో 15 సిలిండర్లను సీజ్ చేసి, యజమాని మహావీర్‌పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీటీ పవన్ మాట్లాడుతూ.. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య పరంగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

March 13, 2026 / 01:22 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ల ప్రారంభం

JGL: మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్లను ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. మెట్‌పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు పెరగడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

March 13, 2026 / 01:22 PM IST

‘భూగర్భ జలాలు పెంపొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం’

అన్నమయ్య: చిన్నమండెం మండలం కేశాపురంలో పాలేటమ్మ చెరువు పూడికతీత, కటువ మరమ్మతు పనులను టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. చెరువులు, కాలువల్లో పూడిక తీసి భూగర్భ జలాలను పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వెంకటరత్నం, ఇరిగేషన్ ఈఈ చెంగలరాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 13, 2026 / 01:22 PM IST