భారత సైన్యాన్ని భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేసేందుకు కేంద్రం విజన్-2047 రోడ్ మ్యాప్ విడుదల చేసింది. దీని ప్రకారం స్పేస్, సైబర్ కమాండ్లతో పాటు నాలుగు కొత్త త్రివిధ దళ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక యుద్ధ తంత్రం, వాయు రక్షణ వ్యవస్థల బలోపేతంపై రక్షణ శాఖ దృష్టి పెట్టింది. దీంతో రాబోయే రోజుల్లో మన సైన్యం మరింత శక్తివంతంగా మారనుంది.