ASR: కొయ్యూరు మండలం బాలారం పంచాయతీ సర్పంచ్ అప్పన అప్పలనర్సకు అరుదైన గౌరవం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేదిక పంచుకునే అవకాశం లభించింది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 29న జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో ఆమె స్టేజీ పంచుకోనున్నారు. సీఎంతో వేదిక పంచుకునే అవకాశం లభించడం పట్ల సర్పంచ్ అప్పలనర్స శుక్రవారం సంతోషం వ్యక్తం చేశారు.