NDL: కొత్త పల్లె మండలంలోని పాత మాడుగుల గ్రామానికి చెందిన తెలుగు అశోక్ కుమారుడు బెస్త రిషికేష్ (5) అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు కర్నూలులోని విశ్వ భారతి క్యాన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. తమ మిత్రుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న మిత్ర బృందం కర్నూలుకు చేరుకొని అశోక్ కుటుంబాన్ని ప్రదర్శించారు.
ప్రకాశం: నేరాలు నియంత్రణ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని వెలిగండ్ల ఎస్సై మధుసూధన్ రావు అన్నారు. స్థానిక బస్టాండ్ నందు డ్రోన్ పనిచేసే తీరును ప్రజలకు ఆయన వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇటీవల దాతల సాయంతో జిల్లా ఎస్పీ దామోదర్ ఈ డ్రోన్ కెమెరాను పోలీస్ స్టేషన్‌కు ఇచ్చారన్నారు.
NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు నిత్య అన్నదానానికి విరాళం అందించారు. సీతారామపురం మండలంలోని శ్రీ ఇష్ట కామేశ్వరీదేవి సమేత ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి ఆలయంలో నిత్యాన్నదానానికి రూ.5 లక్షల విరాళం అందించారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో సూరవారి ఇంటిదైవం శ్రీరాముల వారి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఎంపీపీ మొదలవలస చిరంజీవి దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు దర్శించుకున్న వారిలో ఉన్నారు.
MBNR: భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలస్వామి, తిరుపతయ్య, వెంకటయ్య, మల్లయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతన సభ్యులకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
MBNR: ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేది ఎర్రజెండా అని పీసీసీ ఉపాధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. వివిధ రంగాలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం అనే అంశాలపై సీపీఎం నిర్వహించిన సెమినర్‌లో కొత్వాల్ పాల్గొని మాట్లాడారు. ప్రజల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
NLR: సీతారాంపురం మండలం పడమటి రొంపిదొడ్ల గ్రామానికి చెందిన ముట్టుకుందు చెన్నమ్మ (75) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇంటి సమీపంలోని పొలం వద్ద పురుగు మందు తాగింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలో మృతి చెందింది.
ప్రకాశం: హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ అన్నారు. ఆదివారం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పైలాన్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. హెల్మెట్ తలకు రక్షణ కవచమని అది లేకుండా మోటార్ సైకిల్ తోలవద్దని హితవు పలికారు.
HYD: సికింద్రాబాద్ కోటక్ మహేంద్ర సమీపాన ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి బిర్యానీ తింటుండగా కవర్లు రావడంతో షాక్ అయ్యారు. ఈ విషయాన్ని యాజమాన్యాన్ని అడగగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన అతను, వారిపై తగిన విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
SRPT: తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు అనంతారం గ్రామంలో శ్రీకంఠమహేశ్వర స్వామి సురమాంబ దేవి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆదివారం ఎమ్మెల్యే మందుల సామేలు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, గ్రామదేవతల పండుగలతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నారు.
SRD: కంగ్టిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్‌లోనే మరణించారు. స్థానికుల తెలిపిన వివరాలిలా.. మహారాష్ట్రలోని భూతం హిప్పర్గా కు చెందిన అశోక్ పాటిల్ కంగ్టి మండలం తుర్కవడగాంలో ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరై బైక్‌పై తిరిగి వెళ్తున్న క్రమంలో కంగ్టిలోని డివైడర్ ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. కంగ్టి పోలీసులు కేసు నమోదు చేశారు.
ADB: జైనథ్ మండలంలోని ఆకుర్ల గ్రామంలో శ్రీ బాజీరావు మహారాజ్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. బాజీరావు మహారాజ్ ప్రవచించిన ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు.
SRD: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఇవాళ సంగారెడ్డిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా డాక్టర్ కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్, కోశాధికారిగా హరినాథ్, గౌరవ అధ్యక్షునిగా రాజు గౌడ్ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, ఉష, సంయుక్త కార్యదర్శిగా జ్యోతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించారు.
HNK: సర్వే వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఈనెల 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనని, వివరాలు నమోదు చేసుకోని వారు చేసుకోవాలన్నారు. ఆదివారం కాజీపేట సర్కిల్-2లో ఏర్పాటు చేసిన సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి వివరాల నమోదు తీరును పరిశీలించారు.
కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో ఆదివారం జరిగిన సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు నియోజవర్గ ప్రజల మీద ఉండాలని, ప్రజలందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్నారు.