ASR: హుకుంపేటలో నూతన గ్రామ సచివాలయాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ హయాంలో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో ఇంటివద్దకే సేవలందాయన్నారు. ప్రస్తుతం రేషన్, పెన్షన్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సచివాలయ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.