MDK: పెద్దశంకరంపేట మండలంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద శంకరంపేట పట్టణంలోని వివేకానంద విగ్రహానికి ఆయా పార్టీల పలువురు నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యువతకు వివేకానందుడు ఆదర్శప్రాయుడని మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు.
NRPT: మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త బాల్ రాజ్ ఇటీవల మరణించారు. దీంతో సభ్యత్వ నమోదు ద్వారా అందించిన రెండు లక్షల భీమా చెక్కును ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యకర్తలకు పార్టీ అండగా వుంటుందని అన్నారు.
కామారెడ్డి: మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ యువజన దినోత్సవం సందర్భంగా బియ్యంతో స్వామి వివేకానంద చిత్రం తయారు చేశారు. దేశ సంస్కృతిని చికాగో వేదికగా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయులు స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని చిత్రం ద్వారా కోరారు.
MNCL: జన్నారం మండలంలోని కొత్తూరు పల్లిలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన మడావి కౌసల్య అనే మహిళను అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి హత్య చేశారని తెలిపారు. ఒక చిన్నపాటి గొడవ మహిళా హత్యకు దారితీసిందని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
KMM: కూసుమంచి మండలంలోని పాలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 2025-26 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. నవోదయలో 80 సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరించారు. ములుగు జిల్లాలోని వెంకటాపురం సహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,213 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
NRML: జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రజలకు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పత్రిక ప్రకటన విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువకులు అన్ని రంగాల్లో రాణించాలని, నిర్మల్ నియోజకవర్గ పేరును యువకులు ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు.
VSP: ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు సంక్రాంతి వేడుకలు నిర్వహించనున్నట్లు బీజేపీ మాజీ రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు పేర్కొన్నారు. 12న కోలాటం పోటీలు, 13న భోగి మంట, సాయంత్రం భోగి పండ్లు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 14న గాలి పటాల పండుగ నిర్వహిస్తామన్నారు.
KMR: జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వామీ వివేకానంద స్ఫూర్తివంతమైన సూక్తులను ఏబీవీపీ ఆచరిస్తుందని జిల్లా ప్రముఖ్ గిరి తెలిపారు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో యువజన ఉత్సవాలు సైతం నిర్వహిస్తున్నామని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా క్లస్టర్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు జిల్లాలో ఉన్న 235 కాంప్లెక్స్‌లకు, 170A క్లస్టర్లుగా 65 బి క్లస్టర్లగా విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య ప్రకటనలో తెలిపారు. మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు.
ADB: భీంపూర్ మండలంలోని ఆదివాసీ రైతులకు గిరివికాస్ పథకం కింద బోర్లు మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో ఆదివాసీలు రెండు పంటలను పండించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేకు వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుడిమేత సంతోష్, గుంజల మాజీ ఉప సర్పంచ్ మాడవి వినోద్ తదితరులున్నారు.
NLG: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ధి కోసం మూడు పథకాలు అమలు చేయనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలో చేనేత మగ్గాలపై ఆధారపడిన వారు సుమారు 25 వేల మంది, మరమగ్గాలపై ఆధార పడినవారు 6 వేల మందికి లబ్ధి చేకూరనుంది. నేతన్న పొదుపు నిధికి రూ.115 కోట్లు, నేతన్న భద్రత కొరకు రూ.9 కోట్లు, నేతన్న భరోసాకు రూ.44 కోట్లు కేటాయించింది.
RR: ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిరసన తెలపకుండా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు పోలీసులు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
WGL: సంక్రాంతి సెలవులు వచ్చిన సందర్భంగా సెలవులకు ఊర్లకు వెళుతున్న వారికి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ, మండల ప్రజలకు పట్టణ సీఐ రమణమూర్తి శనివారం పలు సూచనలు చేశారు. ఊరుకు వెళ్లే ముందు పేపర్ పాల ప్యాకెట్ వాళ్ళని మీరు వచ్చేవరకు రావద్దని చెప్పండి. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండ బ్యాంకు లాకర్లలో పెట్టాలని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి సందడి నెలకొంది. సోమవారం భోగి కావడం, ఆదివారం సెలవు రోజు కావడంతో యువకులంతా భోగిమంటల కోసం ఉత్సాహంగా కర్రల సేకరణ చేస్తున్నారు. భోగి మంటల కోసం కొన్ని కర్రలను ముందు రోజు సేకరించి, భోగి రోజు ప్రతి ఇంటి నుంచి మరికొన్ని కర్రలు వేస్తూ ఉత్సాహంగా ఈ పండగ జరుపుకుంటామని జిల్లా ప్రజలు తెలిపారు.
ప్రకాశం: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మండలంలో కోడిపందేలు, జూదం ఇతర నిషేధిత ఆటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంతమాగులూరు ఎస్సై పట్టాభి రామయ్య హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. నిషేధిత జూద క్రీడలు నిర్వహించడం, ప్రోత్సహించడం చేయకూడదన్నారు. వీటిని ఆడేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలలో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేశామన్నారు.