2026 T20 WC సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ప్రకటనల ద్వారానే ఈ మెగా టోర్నీ సుమారు రూ.1,500 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు ‘Exchange4Media’ వెల్లడించింది. ముఖ్యంగా భారత్-పాక్ పోరుతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు ప్రకటనల ధరలు ఆకాశాన్నంటాయి. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల విక్రయాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.9,000 కోట్లను దాటుతుందని అంచనా.