VKB: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలో ఉంటుందని ఎస్పీ స్నేహ మెహ్రా అన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని 69 సెంటర్ట వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల వరకు గుంపులు గుంపులుగా ఎవరూ ఉండకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు.