KMM: కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా 12 కోట్ల 48 లక్షల అంచనా వ్యయంతో పలు బీటీ రోడ్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం ముచ్చర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు.