W.G: తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 3 జనరల్ కేటగిరి బార్ లైసెన్స్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మీ తెలిపారు. ఇవాళ ఆమె ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25న భీమవరం కలెక్టరేట్లో లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు.