TPT: తడ ఎస్సై కొండప్ప నాయుడు నేతృత్వంలో ఇవాళ అక్రమంగా బాణాసంచా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కంపేట గ్రామ పరిధిలో తయారు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. బాణాసంచా తయారీకి ఉపయోగించే ముడి సరుకులు, టపాసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా పొలంలో షెడ్లు నిర్మించి తయారీ చేస్తున్నట్లు DSP చెంచు బాబు తెలిపారు.