అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన రావు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీరాముని చరిత్రను సరళమైన తెలుగులో రచించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని ఆయన పేర్కొన్నారు.
KRNL: ఎమ్మిగనూరు వెంకటాపురం రోడ్డులో బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గార్మెంట్ యూనిట్‌ను శుక్రవారం మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యూనిట్ లక్ష్యమని రేణుక తెలిపారు. స్థానిక మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని ఆమె వివరించారు.
W.G: భీమవరం టీడీపీ ఇంఛార్జ్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా దృష్టికి తీసుకువచ్చిన వితంతు పింఛన్లు, వయోవృద్ధుల పింఛన్లు, గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణల వల్ల నిలిపివేసిన పింఛన్లను పరిష్కరిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.
MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవాబుపేట మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం: అర్ధవీడు మండలం కాకర్ల డ్యాం సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కంభం సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ఎస్సై శివ నాంచారయ్య, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.56,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని స్టేషన్ కు తరలించారు.
కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రులో నిర్వహించిన జాతీయ కృత్రిమ గర్భాధారణ అవగాహన సదస్సు, లేగ దూడల అందాల పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేగ దూడల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశు సంపదను కాపాడుకోవడం ద్వారానే స్వచ్ఛమైన పాలు పొంది, కల్తీని నివారించవచ్చన్నారు.
ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు ఇంటి పన్నును కట్టించుకున్నారు. ఆన్‌లైన్ కడుతున్న ఇంటి పన్నులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పంచాయతీ అభివృద్ధి ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.
NRML: కుమ్మర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కవయిత్రి మొల్ల 586వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొల్లమాంబ విగ్రహానికి పూలమాల విషయం నివాళులర్పించారు. తెలుగు రామాయణాన్ని రచించిన తొలి కవయిత్రి మొల్ల అని కొనియాడారు. ప్రభుత్వం ముల్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చన్న గంగాధర్ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.
VZM: గజపతినగరంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, పీఎసీఎస్ ఛైర్మన్ బంగారు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
WGL: పర్వతగిరి మండలానికి చెందిన ఆశా వర్కర్లు తమపై నిరాధార ఆరోపణలతో వార్త ప్రచురించినట్లు ఆరోపిస్తూ సంబంధిత విలేకరులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం మండల రెవెన్యూ అధికారి, పోలీసు శాఖ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఆశ వర్కర్లు రుక్మిణి , శారద, విజయ తదితరులు పాల్గొన్నారు.
E.G: మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని రాజీమార్గంలో కేసులను పరిష్కరించు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు.
TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, నర్సరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్య కిందకు తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, ఉచితంగా లేదా 50% రాయితీతో రవాణా సౌకర్యం కల్పించనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ఈ మార్పు ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ దగ్గర ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ ఆర్థిక సహకారంతో మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ ఈ కిట్లను అందజేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.