TG: 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమురంభీమ్ జిల్లా సిర్పూర్‌లోని ఓ ఇంట్లో మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం. ముందస్తు సమాచారంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి లొంగిపోయేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
E.G: ‘సంసాద్ ఖేల్’ మహోత్సవంలో భాగంగా మంగళవారం సీతానగరం హై స్కూల్ నందు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ ప్రారంభించారు. ముందుగా క్రీడా ప్రాంగణంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, పోటీలను ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సంసాద్ ఖేల్ మహోత్సవం నిర్వహిస్తున్నారన్నారు.
ఓటు చోరీ ర్యాలీలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్ అనైతికంగా మాట్లాడుతున్నారని, అసలు ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దేశానికి దురదృష్టకరమని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కోనసీమ: గ్రామాలలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా వాడ వాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పీ. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అయినవిల్లి మండలం అయినవిల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో గొడవలకు కారణం పల్లా రాజేశ్వర్‌రెడ్డే కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయని కవిత చెప్పింది పల్లా గురించే అని, గొడవల వల్లే బీఆర్ఎస్ భ్రష్టుపట్టిందని పేర్కొన్నారు. రాజయ్యను జీరో చేయాలని పల్లా చూస్తున్నారని, తాటికొండ రాజయ్య ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు.
E.G: తమను, టీడీపీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. విద్య, వైద్యం నిమిత్తం, కుటుంబ అవసరాల కోసం ఐదుగురికి MLA భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున మంగళవారం రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ మేరకు కార్యకర్తల అవసరాలను టీడీపీ నాయకులు గుర్తించి ఆర్థిక సహాయం చేశారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబ్ రీనర్, ఆయన భార్య మిచెల్ సింగర్ రీనర్ హత్యకు గురయ్యారు. ఈ ఘాతుకానికి పాల్పడింది వారి తనయుడు నిక్ రీనర్ కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్‌కు బానిసైన నిక్.. హత్యకు ముందు జరిగిన హాలిడే పార్టీలో రాబ్‌తో గొడవ పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
JN: KGBV చౌడారం పాఠశాలలో నిర్మాన్ సంస్థ సహకారంతో విద్యార్థినులు ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్ ఘన విజయాన్ని సాధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యార్థినులు స్వయంగా సాగు చేస్తూ సుస్థిర వ్యవసాయ పద్ధతులు నేర్చుకుంటూ తాజా కూరగాయలు పండిస్తున్నారు. ఈ గార్డెన్‌ను అదనపు కలెక్టర్, GCDO పరిశీలించి అభినందించారు.
BDK: కరకగూడెం మండలం బట్టుపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో తొలగించి అందులో ఉన్న కాపర్‌ను దొంగలించినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ADB: బోథ్ మండలం న్యూ కాలనీలోని ఓ కిరాణ షాపు యజమాని అజీమ్ వినూత్న ప్రయత్నం చేశారు. గతంలో ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు తమ 15వ వార్డు సమస్యలను పట్టించుకోలేదని, ఈసారి ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే అభ్యర్థులతో హామీ పత్రం మీద సంతకాలు చేయించుకుంటున్నారు. కాలనీ సమస్యలను స్పష్టంగా ఒక ప్లకార్డు మీద రాసి గెలిచిన తర్వాత ఈ గల్లీ సమస్యలను తప్పనిసరిగా పరిష్కరించాలని కోరారు.
MBNR: మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ‘బీసీ మహా ధర్నా’లో ఆయన పాల్గొన్నారు. సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేయాలని, తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి సమీపంలో గ్రానైట్ క్వారీల వద్ద నడికుడి-శ్రీ కాళహస్తి రైల్వే నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, రైల్వే అధికారితో కలిసి పరిశీలించారు. రైల్వే లైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
NDL: ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలూటి రేంజ్లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులు లభ్యం కావడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు నల్లమల అడవిని జల్లెడ పడుతున్నారు. నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (NSTR)లో గస్తీ ముమ్మరం చేశారు. పులిని వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారి కోసం గాలిస్తున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ అధికారి బి. విజయ్ కుమార్ తెలిపారు.
NRPT: ధన్వాడ మండలం పాతపల్లి గ్రామ బీజేపీ మద్దతుదారు వెంకటేష్ గౌడ్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు ఫిర్యాదు చేశారు. మొదటి వార్డు పోలింగ్ సిబ్బంది స్వస్తిక్ ముద్ర ఇవ్వకుండా వేలిముద్ర వేయించారని ఆరోపించారు. ఆర్వో శ్రీనివాస్ 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని, ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు.
E.G: 1971లో జరిగిన భారత్, పాకిస్తాన్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి ప్రతీకగా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ జరుపుకుంటున్నట్లు కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నాటి యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారత జవాన్ల స్మృతికి మంగళవారం ఘన నివాళులు అర్పించారు. భారత సైనికుల త్యాగాలను గౌరవించడానికి ఈ రోజు అంకితం చేశారన్నారు.