PDPL: ధర్మారం మండలం కటికనపల్లి, బొమ్మరెడ్డిపల్లి, ధర్మారంలలో శుక్రవారం మేడారం పీహెచ్సీ ఆధ్వర్యంలో టీబీ ముక్తి విలేజెస్, కొత్త టీబీ యాక్టివిటీస్ గురించి అధికారులు అవగాహన కల్పించారు. అలాగే టీబీ చాంపియన్స్ చేసిన యాక్టివిటీస్కి డాటా క్వాలిటీ ఎనాలసిస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, టీబీ చాంపియన్స్ పాల్గొన్నారు.