KMR: పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం 247 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 0.695 టీఎంసీల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.870 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.