SKLM: పాతపట్నం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అరికట్టేందుకు ప్రతి పంచాయతీలోనూ బోర్లును త్రవ్వించాలి అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.ఈ మేరకు మంగళవారం జెడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అధిక నిధులను వెచ్చించి అధికారులు అన్ని విధాలుగా సహకరించాలన్నరు.
NZB: కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేర్చాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో ఐకేపీ మహిళా సంఘాల, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు.
HYD: హైదరాబాద్‌లో MMTS విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సిటీ పరిధిలో 102.4 కి.మీ. పొడవున ఆరు మార్గాల్లో కొత్త రైల్వేలైన్లు ఏర్పాటు చేయనుంది. అలాగే ఫలక్ నుమా-ఉందానగర్ వంటి ప్రాంతాల్లో డబ్లింగ్ నిర్మాణాలను చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్లో ప్రకటించారు.
ప్రకాశం: మంత్రి స్వామి డెహ్రాడూన్‌లో జరుగుతున్న చింతన్ శివిర్ రెండవ రోజు సమావేశంలో మంగళవారం పాల్గొన్నారు. ఏపీలో అమలు చేయనున్న పీ-4పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. రూ.143 కోట్లతో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేస్తున్నామన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు.
KMR: సంపన్నులతో సమానంగా పేదలకు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం గాంధారి మండలం పెద్ద గుజ్జల్ తండాలో బానోత్ సోఫీ, వినోద్ ఇంట్లో కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
E.G: రెవెన్యూ పరంగా పీజీఆర్ఎస్‌లో 6765 అర్జీలు పరిష్కారం కోసం రాగా 6,226 పరిష్కరించినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ కమిషనర్ జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా 539 అర్జీలను పరిష్కారం చెయ్యాల్సి ఉందని వివరించారు.
KMR: అసంఘటిత రంగ కార్మికులందరూ ఈ శ్రమ్ కార్డు పొందాలని కార్మిక శాఖ సహాయ అధికారి మహమ్మద్ ఇబ్రహీం జుబేర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో అసంఘటిత కార్మికులకు అవగాహన కల్పించారు. కార్డు కలిగిన కార్మికులు ప్రమాదవశత్తు మరణిస్తే రెండు లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ దావుద్, కార్మికులు ఉన్నారు.
ప్రకాశం: పంగులూరు మండలంలోని బయట మంజులూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ సర్వే పనులను మంగళవారం తహశీల్దార్ సింగారావు పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలిక భూముల పరిష్కారానికి రీసర్వేతో సాధ్యమని తెలిపారు. రీసర్వే సమయంలో తమ పొలాల వద్ద రైతులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓ, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
ఆసిఫాబాద్: కాగజ్ నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో మంగళవారం 314 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆడబిడ్డ పెళ్లి కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.
NRML: దిలావర్పూర్ మండలంలో మంగళవారం జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరారు.
NRML: దిలావర్పూర్ మండలంలోని కాల్వ, న్యూ లోలం, దిలావర్పూర్ గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను మంగళవారం డీఆర్డీఓ శ్రీనివాస్, ఏపీడీ నాగవర్ధన్‌లు పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ.. రోజువారి కూలీ, పనికొలతలపై అవగాహన కల్పించారు. ఎండాకాలం వడదెబ్బ తలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఎంపీఓ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల 25 వేల మంది బెంగాల్ టీచర్ల నియామకాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. చట్టపరంగా ఉద్యోగాలు పొందిన వారిని కొనసాగించేలా చూడాలని లేఖలో కోరారు.
KMR: బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబీ గార్డెన్‌లో నిర్వహించే సన్నాహక సమావేశానికి ఈనెల 10న రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరుకానున్నట్లు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ మంగళవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు నాయకులు పోల్గొన్నాలన్నారు.
ELR: ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు డిక్కీ దొంగతనాల కేసుల్లో నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. షేక్ గాల్సిద్, బొంతు రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.5 లక్షల నగదు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారన్నారు.
NRML: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పేద ప్రజలకు వరమని అన్నారు. ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలోని లబ్ధిదారుని ఇంట్లో ఆమె మంగళవారం భోజనం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు పాల్గొన్నారు.