• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

BSP భువనగిరి పార్లమెంట్ ఇంచార్జిగా ‘కత్తుల కాన్షీరామ్’

NLG: BSP బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా కట్టంగూరు మండలం కలిమెర గ్రామానికి చెందిన కత్తుల కాన్షీరామ్‌ను నియమిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్ తెలిపారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ పరిధిలో కాన్షీరామ్ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.

March 13, 2026 / 07:13 PM IST

జిల్లాలో సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు: కలెక్టర్

KNR: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని పేర్కొన్నారు. యధావిధిగా సరఫరా జరుగుతూనే ఉందని తెలిపారు.

March 13, 2026 / 07:13 PM IST

విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలి: కలెక్టర్

WGL: రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు WGL జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భయం లేకుండా, ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. ప్రతి విద్యార్థి మంచి ఫలితాలతో భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షించారు. 10వ తరగతి పట్టా విద్యార్థుల జీవితంలో తొలి పట్టా అని అన్నారు.

March 13, 2026 / 07:13 PM IST

అన్నదాత సుఖీభవ చెక్కు అందజేత

AKP: జిల్లాలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ వికాస్ కింద 2,42,536 మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.134.27 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అనకాపల్లి పట్టణం గుండాలలో శుక్రవారం అన్నదాత సుఖీభవ పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ.. రైతు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రైతులు అభివృద్ధిలోకి రావాలన్నారు.

March 13, 2026 / 07:13 PM IST

‘చెస్ ఆటతో విద్యార్థుల మేథస్సు పెరుగుతుంది’

NZB: చెస్ ఆటతో విద్యార్థుల మేథస్సు పెరుగుతుందని చెస్​ నెట్​వర్క్​ సంస్థ ప్రతినిధి కిరణ్​కుమార్​రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం సంస్థ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్​లో మండల పరిధిలోని ప్రతి పాఠశాలకు, కేజీబీవీలకు, రెసిడెన్షియల్ స్కూళ్లకు టీచర్లు, ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా చెస్ బోర్డులను పంపిణీ చేశారు.

March 13, 2026 / 07:12 PM IST

‘గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు’

MNCL: జిల్లాలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు అవసరానికి సరిపడా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గ్యాస్ బుకింగ్, నిల్వలపై సమీక్షిస్తున్నామని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

March 13, 2026 / 07:11 PM IST

ముగ్గురు ధర్మకర్తల ముందస్తు రాజీనామా

JGL: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి పదవీకాలం ముగియకముందే ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం. గత కొన్ని నెలల క్రితమే వారు రాజీనామా చేసినప్పటికీ దానికి గల కారణాలను ఆలయ అధికారులు లేదా మండలి సభ్యులు ఇప్పటివరకు వెల్లడించలేదు. కొత్త ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఎప్పడు నియమిస్తారనేది ఆసక్తి నెలకొంది.

March 13, 2026 / 07:10 PM IST

ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

TG: రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నెలలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

March 13, 2026 / 07:10 PM IST

గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి

KDP: కలసపాడు మండలం లింగారెడ్డి పల్లెకు చెందిన జర్నలిస్ట్ అమర్నాథ్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ పెద్ద మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి మృతితో పలువురు జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

March 13, 2026 / 07:07 PM IST

మండల సర్వసభ్య సమావేశం ఎప్పుడంటే..!

KRNL: మహానంది మండలం తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 18న మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మహబూబ్ దౌలా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండల అధ్యక్షురాలు బుడ్డారెడ్డి యశస్విని అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలోని ఆయా శాఖ అధికారులు నివేదికలతో హాజరు కావాలని కోరారు.

March 13, 2026 / 07:06 PM IST

రేపే పది పరీక్షలు.. ఎస్పీ హెచ్చరికలు జారీ

NLG: జిల్లాలో ఈ నెల 14 నుంచి వచ్చే నెల 16 వరకు జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామన్నారు. పరీక్షా కేంద్ర పరిసరాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 13, 2026 / 07:06 PM IST

ఉస్తాద్ భగత్ సింగ్.. టికెట్ రేట్లు పెంపు

పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే, పది రోజులపాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 టికెట్ ధరలు చొప్పున పెంచుకునే అవకాశమిచ్చింది.

March 13, 2026 / 07:05 PM IST

స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

KMR: తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కామారెడ్డి పోలీస్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈ మేరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చిన పోలీస్ క్రీడాకారులను ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం అభినందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 వరకు ‘తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్’ నిర్వహించారు.

March 13, 2026 / 07:04 PM IST

గ్యాస్ కొరత అపోహలను నమ్మవద్దు: అదనపు కలెక్టర్

NRPT: వంట గ్యాస్ కొరతపై అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు ఫణీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాపై తక్షణం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలకు నిరంతర సరఫరా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 13, 2026 / 07:04 PM IST

పదవ తరగతి పరీక్షలకు 380 మంది విద్యార్థులు

ప్రకాశం: మర్రిపూడి మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఎంఈవో రంగయ్య తెలిపారు. మండలంలో మొత్తం 380 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయినున్నట్లు తెలిపారు. జడ్పీహెచ్ పాఠశాలలో 235 మంది జూనియర్ కళాశాలలో 145 మంది విద్యార్థులు రాయనున్నట్లు చెప్పారు.

March 13, 2026 / 07:04 PM IST