NZB: జిల్లాలో శుక్రవారం పర్యటించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. మంత్రికి కాంగ్రెస్ నేతలు గజమాల వేసి స్వాగతించారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మేయర్ ఉమారాణి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ ఉన్నారు.
ASR: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నగదు రైతులు సద్వినియోగం చేసుకోవాలని చింతపల్లి ఏవో మధుసూధనరావు కోరారు. శుక్రవారం వామగెడ్డ ఆర్ఎస్కేలో రైతులతో సమావేశమయ్యారు. పీఎం కిసాన్ 22వ, అన్నదాత సుఖీభవ 3వ ఇన్‌స్టాల్మెంట్ ల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేయడం జరిగిందన్నారు. మండలంలో 10,421 మంది రైతులకు రూ.6,25,26,000 నగదు జమ అయిందన్నారు.
AKP: ఎలమంచిలి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ కిసాన్ వికాస్ పథకం కింద 33,648 మంది రైతుల ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.18.45 కోట్లు జమ చేసినట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. మునగపాకలో శుక్రవారం జరిగిన అన్నదాత సుఖీభవ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవూర్గ టీడీపీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ మేరకు అల్లూరి జిల్లా నందిగరువు ప్రజలతో పవన్ మాట్లాడనున్నారు. గిరిపుత్రులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అడవితల్లి బాటలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ ప్రారంభించనున్నారు.
VZM: రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. బొబ్బిలిలో శుక్రవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2,27,700 మంది రైతు కుటుంబాలకు రూ.127.63 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నట్లు పేర్కొన్నారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెదిరింపులకు పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. ఆర్కే కోపరేటివ్ సొసైటీ ఛైర్మన్ కొండూరి రాకేందర్, సొసైటీ మేనేజర్‌గా రాగం రమేష్‌లను కొంతమంది వ్యక్తులు బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
SDPT: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు DSO తనుజ అధ్యక్షతన జరిగింది. మార్కెట్‌లో వస్తువులు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ, గడువు తేదీ పరిశీలించాలని సూచించారు. చైతన్యంతోనే మోసాలను నివారించవచ్చని తెలిపారు. ఆహార పదార్థాల్లో కల్తీ, తూకాల్లో మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
MDK: శివంపేట మండల వ్యాప్తంగా ఇలాంటి గ్యాస్ కొరత లేదని తహసీల్దార్ కమలాద్రి తెలిపారు. మండల కేంద్రంలోని గ్యాస్ గోదాములను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలో ఉన్న గ్యాస్ సిలిండర్ నిల్వలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేసి, గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఇబ్బందులు కలగవద్దని సూచించారు.
GDWL: జిల్లాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హాజరవుతారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క కూడా పాల్గొనే అవకాశం ఉంది.
MDK: చేగుంట మండలం జైత్రం తండాలో నూతనంగా గ్రామపంచాయతీ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు. ఈజీఎస్ పథకం కింద నిధులు మంజూరు కాగా గ్రామ సర్పంచ్ ధరావత్ సుభాష్ నాయక్ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఉప సర్పంచ్ రాజేందర్, వార్డు సభ్యులు మోహన్, శోభ లౌడియా లాలీ, గణేష్, స్వప్న గ్రామ కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.
NTR: వీరులపాడు మండల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నుంచి ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై అభిమన్యు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను అతలాకుతలం చేసే ప్రమాదం ఉన్నందున తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు.
BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం విద్యార్థులు సరస్వతి దేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షల్లో విజయవంతం కావాలని విద్యార్థులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కలిసి శుక్రవారం ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కోనేటి పుష్పలత మున్సిపల్ కుర్చీలో కుర్చున్నారు. నూతన భవనంతో ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని, పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
PLD: ఈనెల 16న జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంఈవో రవి కుమార్ అన్నారు. శుక్రవారం కారంపూడిలోని తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మండలం మొత్తం 654 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కారంపూడిలోని మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
కృష్ణా: నియోజకవర్గంలో రైతులకు రూ.57.591 కోట్లు లబ్ది చేకూరినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం అవనిగడ్డ రెవిన్యూ హాలులో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడవ విడత సభ జరిగింది. రైతులతో కలిసి నియోజకవర్గంలో 30,316 మంది రైతులకు రూ.17.05 కోట్లు లబ్ది చెక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు.