PDPL: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇవాళ గోదావరిఖని పట్టణంలోని 7 హోటల్స్‌ను తనిఖీ చేసినట్లు అదనపు కలెక్టర్ వేణు ఒక ప్రకటనలో తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తుండడంతో 19 సిలిండర్స్ సీజ్ చేసి, 7 హోటల్స్‌పై కేసులు నమోదు చేశామని తెలిపారు.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి తన కార్ల ధరలను 2% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో మోడల్‌ను బట్టి ధర రూ.89,000 నుంచి రూ. 7.33L వరకు పెరగనుంది. లగ్జరీ కార్ల ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్.
W.G: ఉండి AMC నగదు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది సీఎం చంద్రబాబుకు రైతులంటే చాలా ఇష్టమని, మన జిల్లా చూస్తే 65 శాతం ఆదాయం రైతుల నుంచే వస్తుంది అన్నారు. ఏ రాష్ట్రం ఇలా ఇవ్వటం లేదన్నారు.
KDP: రాజంపేటలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రేపు (మార్చి 14) ఘనంగా నిర్వహించనున్నారు. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంఛార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మన్నూరు యల్లటూరు భవన్‌లో ఉదయం 10 గంటలకు పార్టీ పతాక ఆవిష్కరణ, మధ్యాహ్నం 12 గంటలకు అన్న క్యాంటీన్‌లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.
BHPL: పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు డెడ్‌లైన్ పెట్టాలని, గడువు ముగిసినా పూర్తి కాకపోతే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని IT మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
SRD: కంగ్టి మండలం తడ్కల్‌లో శుక్రవారం సాయంత్రం సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన దావత్- ఏ – ఇఫ్తార్ విందులో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల ముఖ్యోద్దేశ్యమని ఆయన అన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గ్రామపంచాయతీ కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వేది పత్రాలు అందిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
SDPT: హుస్నాబాద్ జ్యోతి నగర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మండల మహేష్, తన తల్లి సారవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
SRPT: కోదాడలో కల్తీ వంటనూనె తరలిస్తున్నారన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈరోజు కోదాడలో పోలీసుల సహకారంతో ట్యాంకర్, ఆటోను తనిఖీ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపారు. నివేదికలో కల్తీ అని తేలితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
AP: మాజీ డీజీపీ HJ దొర మృతిపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీ పోలీసు విభాగంలో విశిష్ట సేవలు అందించిన అధికారిగా HJ దొర సేవలను జగన్ గుర్తుచేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతకు ఆయన కృషి చేశారని తెలిపారు. పోలీసు వ్యవస్థకు ఆయన అందించిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ ఎక్స్ రోడ్ వద్ద లారీ–బైక్ ఢీకొనడంతో మెట్టుపల్లి గ్రామంకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. అంతడుపుల నరేష్ తలకు తీవ్ర గాయం కాగా, వంగల సంపత్ రెడ్డి కాలు విరిగింది. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది గాయపడిన వారిని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
JGL: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో గుంపులు, సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని వెల్లడించారు.
TG: రాష్ట్రంలోని బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను ఆర్జీయూకేటీ బాసర వీసీ గోవర్దన్ విడుదల చేశారు. మార్చి 16న నోటిఫికేషన్, మార్చి 18 నుంచి మే 10వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.
SRPT: మోతే మండలం మామిళ్ళగూడెం గ్రామ శివారులోని చెరువులో ఓ వ్యక్తి ఈరోజు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.