AP: విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ నాగబాబు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంలో సభ్యత్వ నమోదు అత్యంత కీలకమని, ఇందులో ‘సాధక్’ల పాత్ర ప్రధానమని పేర్కొన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సభ్యత్వాల నమోదును వేగవంతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ప్రకాశం: కొండపి(మం) కే. ఉప్పలపాడు జడ్పీహెచ్ పాఠశాలలో జరుగుతున్న అక్షరాంధ్ర పరీక్ష కేంద్రాలను ఎంపీడీవో రామాంజనేయులు ఆదివారం పరిశీలించారు. ఇటీవల కాలంలో నిరక్షరాస్యల్ని అక్షరాశులు చేయాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా అక్షరాభ్యాసకులు గ్రామాల్లో ముందుకు వచ్చారన్నారు. అక్షరాలు నేర్చుకున్న వారికి పరీక్షలు ఈ రోజు నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాలను ఎంపీడీవో తనిఖీ చేసారు.
TPT: నాయుడుపేట సీఎస్ తేజ్ థియేటర్ సెంటర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుప్పారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వేగుంట సాయికుమార్ (27) మృతి చెందాడు. బైక్‌ను అకస్మాత్తుగా అడ్డుగా వచ్చిన మహీంద్రా తుఫాన్ క్రాస్ చేయడంతో ఆయన బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆదివారం భారీ విరాళం అందజేశారు. అనంతసాగరం వాస్తవ్యులు, బట్రేరెడ్డి వెంకటసుబ్బారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన వారసులు, అక్క లక్ష్మీ ప్రసన్న, తమ్ముడు శ్రీధర్ రెడ్డిలు శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,000/- విరాళాన్ని అందజేశారు.
SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు రాష్ట్ర అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలోని నీటి కుళాయిల వద్ద కొత్త ట్యాపులు ఏర్పాటు చేసి లీకులను సరిచేశారు. వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ నవీన్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా LPG సిలిండర్ల సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత, పట్టణ ప్రాంతాల్లో 30 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు.
GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నేరుగా రావడమే కాకుండా, ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి వేగంగా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.
గ్యాస్ సిలిండర్ పైభాగంలో A, B, C, D అక్షరాలతో కూడిన సంఖ్య ఉంటుంది. ఇవి గడువు తేదీని సూచిస్తాయి. A అంటే మార్చి, B జూన్, C సెప్టెంబర్, D డిసెంబర్ నెలలను సూచిస్తాయి. పక్కనే ఉన్న సంఖ్య సంవత్సరాన్ని తెలుపుతుంది. గడువు ముగిసిన సిలిండర్లను వాడటం ప్రమాదకరం. కాబట్టి, డెలివరీ తీసుకునే ముందే ఆ తేదీని క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవడం ఉత్తమం.
E.G: నల్లజర్ల మండలం వ్యాప్తంగా ఆదివారం అక్షరాంధ్ర రాత పరీక్షలు నిర్వహించారు. 91 కేంద్రాలలో 3,608 మంది నిరక్షరాస్యులకు పరీక్షలు జరిగాయి. వీటిని ఎంపీడీవో సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వయోజన విద్య కార్యక్రమంలో భాగంగా వీరిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు అధికారులు ఈ పరీక్షలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.
MDK: రాంపూర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హవేలీఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్, రిషి వర్ధన్ గౌడ్, అల్లుడు సాయ గౌడ్ మరణించారు. ఆదివారం వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పద్మదేవేందర్ రెడ్డి గారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
VZM: బొండపల్లి మండలం జిపిఅగ్రహారం గ్రామానికి చెందిన సుమారు 60 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాధరంగా ఆహ్వానించారు. చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పాలన నచ్చి పార్టీలో చేరుతున్నామని వారు చెప్పారు.
విశాఖ మధురవాడలో అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. జీవీఎంసీ 7, 8వ వార్డుల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిలో మధురవాడ జోన్‌లో రూ.50 కోట్ల పనులు చేపట్టామని తెలిపారు.
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి, గ్రామీణుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. యువత క్రీడల్లో రాణించి శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
అనకాపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, విశాఖ నగర మేయర్ శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టులను రూ.3.70 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త పీలా గోవిందు పాల్గొన్నారు.
WNP: గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దమాడూరు గ్రామంలో రూ.21 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులు దశాలవారీగా పూర్తి చేస్తామన్నారు.