NZB: హర్యానాలోని కర్నల్ పానిపత్‌లో ఈ నెల 15 నుంచి 18 వరకు, జరుగుతున్నటు వంటి, 71వ మహిళల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి గోదావరి ఎంపిక కావడం జరిగింది. తెలంగాణ మహిళా కబడ్డీ క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర కబడ్డి సంఘం అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, కోచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
KMR: బాలికను అపహరించిన యువకుడికి స్థానికులు దేశ శుద్ధి చేసిన ఘటన గాంధారి మండలం మొండి సడక్ వద్ద శుక్రవారం జరిగింది. బోర్గం గురుకుల పాఠశాల నుంచి ఓ యువకుడు మొండి సడక్ వద్ద దుకాణాల్లో డబ్బులు అడుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చి స్థానికులు యువకుడిని నిలదీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆగ్రహించి అతనికి దేశ శుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
KMR: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై తాము చర్చకు సిద్ధమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్‌లో పట్టభద్రుల ఓటర్ల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల హామీ’ చెల్లని రూపాయిగా మారిందన్నారు.
NLG: నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. ఈ మేరకు ఓరైతు నుంచి రూ.12వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ రవి నాయక్ పట్టుబడ్డారు. దీంతో ఒక్కసారే ఏసీబీ అధికారులు దాడి చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.
KDP: పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో శనివారం ఉదయం స్వచ్ఛతా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాముడు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పొడి, చెత్తలను వేరు చేయు విధానం, హోం కంపోస్టింగ్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే మానవహారం, సామూహిక శుభ్రత కార్యక్రమాలు ఉంటాయన్నారు.
TG: ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల పట్ల బీజేపీ భగ్గుమంది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన వారో రేవంత్ చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందర్ రావు డిమాండ్ చేశారు. అలాగే, రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. 1994లోనే గుజరాత్‌లో కాంగ్రెస్ సర్కారు మోదీ కులాన్ని బీసీలో చేర్చిందని గుర్తుచేశారు.
HYD: ఓయూ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లమా ఇన్ హెల్త్ కేర్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
AP: నేరస్థులు రాజకీయ ముసుగులో ఉంటే ప్రజాస్వామ్యానికే పెనుముప్పు అని CM చంద్రబాబు అన్నారు. YCP పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసిన వారు ఇప్పుడు కొత్త దారులు వెతుక్కుంటున్నారని తెలిపారు. అబద్దాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించాలని తాపత్రయ పడుతున్నారని చెప్పారు. వారి ప్రయోజనాల కోసం ఎవరినైనా ముంచేందుకు వెనుకాడరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో చట్టపరంగానే పరిపాలన నడుస్తుందన్నారు.
SRD: కంగ్టి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాన్ని ఆర్డిఓ అశోక్ చక్రవర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడ్కల్ మండల ఏర్పాటులో రెండు గ్రామాలు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంగా గాజుల పాడ్, సుక్కల్ తీర్థ్ గ్రామాలకు సందర్శించి గ్రామ ప్రజల అభిప్రాయాలు సేకరించామని తెలిపారు. ఈ నివేదిక జిల్లా అధికారులకు సమర్పిస్తామని తెలిపారు.
MNCL: కవ్వాల్ గ్రామంలో చుట్టు పక్క ఉన్న చెరువులు, కుంటలలో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అసైన్డ్ చెరువు శిఖం భూములను అడ్డు అదుపు లేకుండా కబ్జా చేశారు. చెరువులపై పడటంతో దీని విస్తీర్ణం క్రమక్రమంగా హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. చెరువు భూముల్లో ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని శుక్రవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణ: వల్లభనేని వంశీ అరెస్టుపై హోంమంత్రి శుక్రవారం స్పందించారు. కర్మ సిద్ధాంతం ఎవరిని వదిలి పెట్టదని.. తప్పు చేసినవారికి శిక్ష తప్పదని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విజయవాడలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వారిని డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టుకోనిచ్చేవారు కాదన్నారు.
VSP: పూర్ణా మార్కెట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక చిరు వ్యాపారస్తులతో భేటీ అయ్యారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వ్యాపారం చేసుకోడానికి మార్కెట్లో సముదాయలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.
NRML: ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాదు ప్రాంతీయ ఆధార్ కార్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఆధార్ కేంద్రాలలో సులువుగా ఆధార్ నమోదు,పేరు, చిరునామ తదితర వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
ASR: హుకుంపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన మత్స్యగుండం మత్స్యలింగేశ్వరస్వామి మహాశివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ శుక్రవారం ఆదేశించారు. ఈనెల 25, 26, 27వ తేదీల్లో మత్స్యగుండం జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు రోజులు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.