సత్యసాయి: పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై 7 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
సత్యసాయి: సోమందేపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ శుక్రవారం దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి ఉత్తర వైకుంఠ ద్వారం ద్వార స్వామి వారికి దర్శించుకుని ప్రత్యేక పూజ చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాజీ మంత్రికి శటగోపం పెట్టి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆమెను సన్మానించి ప్రసాదాలు అందజేశారు.
ATP: టీటీడీ నిర్లక్ష్యంతో ఆరుగురు భక్తుల నిండు ప్రాణాలు కోల్పోయారని ఇందుకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని గుంతకల్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా తొక్కిసిలాటలో మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో ఇవాళ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఆన్‌లైన్‌లో HD ప్రింట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. కాగా, దీనిపై మేకర్స్ ఇంకా స్పదించలేదు. ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు.
ఇనుప కడాయిల్లో చేసిన వంటకాలు రుచిగా ఉంటాయి. అయితే కొన్నింటిని ఐరన్ కడాయిల్లో చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. టొమాటో, చింతపండు, నిమ్మకాయతో చేసే వంటలు ఐరన్‌తో రియాక్ట్ అవుతాయి. వంకాయ, పాలకూర వంటివి ఇనుప కడాయిలో వండకూడదు. కోడిగుడ్డు, బీట్‌రూట్, తీపి పదార్థాల రుచి పోతుందట. అయితే ఇనుప కడాయి వాడకానికి ముందు నూనె పట్టించి, రుద్ది.. క్లీన్ చేశాక వాడుకోవాలి.
NLR: అల్లూరు మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో శుక్రవారం కోడి పందాలు నిర్వహణ, పాల్గొనుట చట్ట రీత్యా నేరం అనే అంశంపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే కోడిపందాలు నిర్వహించడం-పాల్గొనడం చట్టరీత్య నేరం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
NLR: కోవూరు గ్రామపంచాయతీ పరిధిలో పంచాయతీ అభివృద్ధికి పారిశుద్ధ్య కార్మికులు విశిష్ట సేవలు అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ శుక్రవారం వైసీపీ నేతలు పంచాయతీ కార్యదర్శికి వినత పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
AP: విద్యార్థులకు వికాసవంతమైన విద్యను అందించాలని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. కూటమి ప్రభుత్వం విద్యా సంస్కరణలకు పూనుకోవటం మంచి పరిణామం అని పేర్కొన్నారు. సమాజ పరిస్థితులను తెలుసుకునేలా విద్యాబోధన ఉండాలని వ్యాఖ్యానించారు. చదువు అంటే పాఠ్య పుస్తకాలు, తరగతి గదులు, ర్యాంక్స్, మెడల్స్‌కే పరిమితం కాకూడదని తెలిపారు.
AP: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారపురం గ్రామంలోని కృష్ణుడు గుడి వద్ద నిర్మించిన మినీ గోకులాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాలను సైతం అక్కడి నుంచి లాంఛనంగా ప్రారంభించారు.
SKLM: నరసన్నపేట పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలలో భక్తులు పోటెత్తారు.
SKLM: యువత క్రీడా స్ఫూర్తితో మెలిగి, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పిలుపునిచ్చారు. ఆమదాలవలస జూనియర్ కాలేజీలో ప్రారంభించిన 2025 టోర్నమెంట్‌ను డాక్టర్ దానేటి శ్రీధర్ శుక్రవారం ప్రారంభించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
NRML: జిల్లాలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 11 తేదీన కేజీబీవీ పాఠశాలలకు పని దినంగా ప్రకటించామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని కోరారు.
NRML: నిర్మల్ పట్టణం భాగ్యనగర్ కాలనీకి చెందిన చంద్రం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షల 50 వేల ఎల్ఓసీ చెక్కును శుక్రవారం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు బాధిత కుటుంబానికి అందజేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, కౌన్సిలర్ అన్వర్, రాము తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణ ప్రజలంతా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నానన్నారు
AP: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు తిరుపతి పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని భాస్కర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది.