NRML: సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో గల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారే స్వయంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ స్టాల్ను సర్పంచ్ కలిపే రవళి విలాస్, ఉప సర్పంచ్ గంగాధర్, ఉపాధ్యాయులు పలువురు సందర్శకులు సందర్శించారు. ఆహార పదార్థాలు రుచి చూశారు.