ATP: గుత్తిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణం ప్రధాన రహదారి మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలో గుత్తి సీఐ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. శనివారం ట్రాఫిక్ రద్దీగా ఉండే సర్కిల్‌లో పోలీసులను నియమించారు.
W.G: జబర్దస్త్ నటుడు అప్పారావు శనివారం పాలకొల్లులో ఓ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. జబర్దస్త్, పలు నాటికలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. వరుడి తండ్రి తన స్నేహితుడు కావడంతో ఈ వివాహానికి హాజరైనట్లు అప్పారావు తెలిపారు. ఆయన రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది. పలువురు సెల్ఫీలు దిగారు.
ELR: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఆన్‌లైన్‌లో కొన్ని పేపర్లలో తప్పుడు రాతలు రాయడం తగదని అన్నారు. ప్రజలు వీటిని నమ్మవద్దని కోరారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం వేకువజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ స్వామివారి మూలమూర్తికి సింధూర, ఆకు పూజలు ఘనంగా జరిగాయి. శనివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు.
SRPT: నేరేడుచర్ల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం సేవాలాల్ కృషి చేశారన్నారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలం పద్మాపురం గ్రామం సమీపంలో NH5 రోడ్డు పనులకు సూపర్వైజర్‌గా పని చేస్తున్న ఏనుగు ప్రతాప్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వేమానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో నూతనంగా వివాహాలు చేసుకున్నపెళ్లి కూతురు తల్లిదండ్రులకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కాంగ్రెస్ మేనిపిస్టో ప్రకారం అందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.. జమ్మికుంట – 200, ఇల్లందకుంట – 58, వీణవంక -50 కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు మొత్తం 308 ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారు..
HYD: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఖైత్లాపూర్ దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా డెడ్ బాడీ ఉండడం గమనార్హం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రకాశం: మార్కాపురం ఏమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పట్టణంలో 15వ వార్డులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొని వీధులను మున్సిపల్ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
HYD: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్, ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్థానిక ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ తో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇతర సందేహాల కొరకు office@des.iith.ac.in మెయిల్ చేయాలన్నారు.
ప్రకాశం: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద శనివారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారుకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిందని డ్రైవర్ తెలిపారు. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో సమీప వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: మద్యం మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును తల్లి హత్య చేయించింది. ప్రకాశం జిల్లాకు చెందిన సాలమ్మ మూడో కుమారుడు శ్యాంబాబు మద్యానికి బానిసై దొంగతనాలు చేసేవాడు. ఇటీవల మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తల్లి.. ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
AP: ఎన్టీఆర్ ట్రస్టు సిబ్బందికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమాజ సేవలో ఆ ట్రస్టు 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ప్రసంశలు కురిపించారు. ‘ఆపన్నులకు చేయూతనిస్తున్న మీ సేవా స్ఫూర్తి ప్రశంసనీయం. ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుస్తూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
AP: వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. వంశీ మొబైల్ కోసం రెండు పోలీసు బృందాలు HYDకు చేరుకున్నాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో అతని ఇంట్లో సోదాలు చేసే అవకాశముంది. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలింపు చేపట్టింది. ఇదిలా ఉండగా.. విజయవాడ సబ్ జైలులో వంశీని భార్య పంకజశ్రీ కలిశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. మదురైలోని అరుల్మిగు సోలైమలై మురుగన్ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పవన్ వెంట ఆయన తనయుడు అకీరానందన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలో ఇవాళ సీఎం చంద్రబాబును పవన్ కలవనున్నట్లు సమాచారం.