పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షోతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోకు టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే, పది రోజులపాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 టికెట్ ధరలు చొప్పున పెంచుకునే అవకాశమిచ్చింది.